భూకంప వదంతులతో రోడ్లపైనే జాగారం | Earth quake rumours keeps Local awake at karim nagar district | Sakshi
Sakshi News home page

భూకంప వదంతులతో రోడ్లపైనే జాగారం

Aug 20 2014 8:59 AM | Updated on Sep 2 2017 12:10 PM

కరీంనగర్ జిల్లాలో భూకంప వదంతులు ....ప్రజలకు కంటిమీద కునుక లేకుండా చేశాయి.

కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో భూకంప వదంతులు ....ప్రజలకు కంటిమీద కునుక లేకుండా చేశాయి. భూకంపం వస్తోందని పుకార్లతో జనాలంతా నిద్ర పోకుండా రాత్రంతా రోడ్లపైనే జాగారం చేశారు. కరీంనగర్ జిల్లాల్లో భూకంప పుకార్లు షికారు చేయటంతో జనాలు బిక్కుబిక్కుమంటూ గడిపారు.

 

దీనికి తోడు భూకంప పుకార్లు సెల్ఫోన్ల ద్వారా మూరుమూల గ్రామాలకు పాకి పోవటంతో ఎవరికి వారు తమ బంధువులకు ఫోన్లు ద్వారా సమాచారం అందించారు. దాంతో వారు కూడా నిద్ర పోకుండా జాగారం చేశారు. కరీంనగర్ జిల్లాతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భూకంప వదంతులు షికార్లు చేశాయి. కాగా భూకంప వదంతులను ఆ శాఖ కొట్టిపారేసింది. వదంతులు నమ్మవద్దని ప్రజలకు సూచించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement