ర్యాంకర్ల మార్కులు దాదాపు సమానం | eamcet-2 rankers marks same | Sakshi
Sakshi News home page

ర్యాంకర్ల మార్కులు దాదాపు సమానం

Jul 28 2016 2:17 AM | Updated on Sep 4 2017 6:35 AM

ఎంసెట్-2లో ప్రశ్నపత్రం లీకు ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులందరూ దాదాపు సమాన మార్కులు సాధించారు.

హైదరాబాద్: ఎంసెట్-2లో ప్రశ్నపత్రం లీకు ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులందరూ దాదాపు సమాన మార్కులు సాధించారు. దళారులు మొత్తం 160 ప్రశ్నలకుగాను విద్యార్థులకు 130 నుంచి 140 మధ్య ప్రశ్నలను లీక్ చేశారు. అందుకు అనుగుణంగానే సాధన చేసిన విద్యార్థులు అనుకున్న మాదిరిగా మార్కులు సాధించారు. ఎంసెట్‌లో బయాలజీ గ్రూపు కింద 80 మార్కులుంటాయి.

వీటిలో లీకేజీ పొందిన విద్యార్థులందరూ 60 నుంచి 70 మార్కులు పొందారు. అలాగే ఫిజిక్స్‌లో 40 మార్కులకు గాను 32 నుంచి 38 మధ్య సాధించారు. కెమిస్ట్రీలో 40 మార్కులకుగాను ఇందులోనూ ప్రతీ విద్యార్థి 32 నుంచి 38 వరకు సాధించారు. సీఐడీ దృష్టికి వచ్చిన వాటిలో మచ్చుకు కొన్ని వివరాలు.. ఎస్.ప్రత్యూష 136 మార్కులతో 423 ర్యాంకు సాధించింది. ఇందులో ఈమె బయాలజీలో 65 మార్కులు, ఫిజిక్స్‌లో 36, కెమిస్ట్రీలో 35 మార్కులు సాధించింది. అలాగే పి.రష్మిక 133 మార్కులతో 842 ర్యాంకు సాధించింది. ఈమెకు బయాలజీలో 68 మార్కులు, ఫిజిక్స్‌లో 34, కెమిస్ట్రీలో 31 మార్కులు వచ్చాయి. అలాగే వి.జాహ్నవి 134 మార్కులతో 704 ర్యాంకు సాధించింది. సోనాలి అనే విద్యార్థి 141 మార్కులతో 295 ర్యాంకు సాధించింది. వరంగల్ జిల్లా పరకాలకు చెందిన ఎం.భవాని 133 మార్కులతో 952వ ర్యాంకు సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement