ఫుల్‌గా తాగేసి.. హల్‌చల్ చేశాడు..!

సాక్షి,హైదరాబాద్: సికింద్రాబాద్‌లో మందుబాబు హల్‌చల్ చేశాడు. మద్యం మత్తులో సంగీత్ డీమార్ట్ సమీపంలోని ఓ వీధి స్తంభం ఎక్కి కిందకు దూకుతానని బెదిరించాడు. అతన్ని ఇలియాజ్‌గా స్థానికులు గుర్తించారు. కిందకు దిగాలని స్థానికులు, పోలీసులు అతనికి సర్దిచెప్పే యత్నం చేసినా వినిపించుకోలేదు. తనకు క్వార్టర్ మద్యం ఇస్తేనే స్తంభం దిగుతానని, లేదంటే పైనుంచి దూకుతానంటూ బేరానికి వచ్చాడు. చివరికి అతని ‘డిమాండ్’ మేరకు మద్యం సీసా తీసుకొచ్చి చూపించడంతో పోల్ దిగేందుకు అంగీకరించాడు. స్ట్రీట్ లైట్స్ బిగించేందుకు ఉపయోగించే క్రేన్ సాయంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది అతన్ని కిందకు దించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి