కూటమి మాటలు నమ్మొద్దు | Do Not Believe The Words Of The Alliance | Sakshi
Sakshi News home page

కూటమి మాటలు నమ్మొద్దు

Dec 3 2018 1:50 PM | Updated on Dec 3 2018 1:50 PM

 Do Not Believe The Words Of The Alliance - Sakshi

చందనాపూర్‌లో ఓటేయాలని కోరుతున్న పుట్ట మధు

సాక్షి, రామగిరి/మంథని : మాయమాటలు చెబుతూ మభ్యపెట్టేందుకు వస్తున్న మహాకూటమి నాయకులను నిమ్మితే మనల్ని నట్టేట ముంచుతారని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుట్ట మధు పేర్కొన్నారు. చందనాపూర్, ఎస్సీకాలనీ, పెద్దంపేట, పస్నూరు గ్రామాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. మండల అధ్యక్షుడు పూదరి సత్యనారాయణగౌడ్, అధికార ప్రతినిధి కొంరయ్యగౌడ్, ఎంపీటీసీ ఎలువాక ఓదెలు, నాయకులు దాసరి రాయలింగు, బేతి కుమార్, ఇజ్జగిరి రాజు, గద్దల శంకర్, మేదరవేన కుమార్, రొడ్డ శ్రీనివాస్, పొన్నం సదానందం, శ్యాం(లడ్డా), వేగోళపు మల్లయ్య, ఆసం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


నియోజకవర్గంలో నాల్గున్నర సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేశామని, మరోసారి అవకాశం కల్పిస్తే రాష్ట్రంలో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుట్ట మధు అన్నారు. మంథని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఆదివారం వాకర్స్‌ను కలిశారు. పోలీస్‌ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పరీక్షలో అర్హత సాధించిన యువత ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. వారితో మాట్లాడారు. యోగా సాధన చేస్తున్నవారిని కలిసి ఓటు అభ్యర్థించారు, ఏగోళపు శంకర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement