తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వైన్ ఫ్లూ తీవ్రతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి తీవ్రతను నిరోధించటంతో పాటు, ..
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వైన్ ఫ్లూ తీవ్రతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి తీవ్రతను నిరోధించటంతో పాటు, మందుల పంపిణీ విషయంలో వైద్య శాఖ పనితీరుపై ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న ఆయన...వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్ సాంబశివరావుపై బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది. దాంతో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రసాద్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎన్ఆర్హెచ్ఎం స్కీమ్లో సాంబశివరావు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.