రామయ్యా.. లడ్డూ దక్కదేమయ్యా..! | Sakshi
Sakshi News home page

రామయ్యా.. లడ్డూ దక్కదేమయ్యా..!

Published Wed, Jul 22 2015 12:15 PM

తానీషా కల్యాణ మండపం వద్ద కౌంటర్ వద్ద బారులుదీరిన భక్తులు - Sakshi

భద్రాచలం : గోదావరి పుష్కర స్నానం చేసేందుకు ఖమ్మం జిల్లాలోని భద్రాచలం వచ్చిన భక్తులకు రాముడి ప్రసాదం కరువైంది. రాములోరి దర్శనం తర్వాత లడ్డూ ప్రసాదాల కోసం ఆలయం చుట్టూ తిరిగినా విక్రయశాలలు కన్పించడం లేదు. తానీషా కల్యాణ మండపం వద్ద ఒకే ఒక్క కౌంటర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మంగళవారం లడ్డూల కోసం తోపులాట జరిగింది. పుష్కరాల 12 రోజుల్లో భద్రాచలాన్ని 50లక్షల మంది భక్తులు సందర్శిస్తారని అధికారులు అంచనా వేశారు. కానీ భక్తులు పోగవుతున్నారనే కారణంతో పోలీసుల ఒత్తిడితో ఎనిమిది లడ్డూ కౌంటర్లను ఎత్తేశారు.  ఆర్జిత సేవలు నిలిపివే యడం, లడ్డూలు అమ్ముకోనివ్వకపోవడంతో ఆదాయం బాగా తగ్గుతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement