‘అవన్నీ ప్రైవేట్ లిమిటెడ్ పార్టీలే’

Devendra Fadnavis Speech In Vemulawada Meeting - Sakshi

వేములవాడ బహిరంగ సభలో మహారాష్ట్రా సీఎం ఫడ్నవిస్‌

సాక్షి, సిరిసిల్ల : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను కేసీఆర్‌ అడ్డుకుంటున్నారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా మంగళవారం సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. టీడీపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ప్రైవేటు లిమిటెడ్‌ పార్టీలని విమర్శించారు. బీజేపీ హయాంలో ఏర్పడిన మూడు రాష్ట్రాలు అభివృద్ధి చెందాయని, కానీ కాంగ్రెస్‌ హయాంలో ఏర్పడిన తెలంగాణ మాత్రం వెనకబడి ఉందని అన్నారు. గత ఎన్నికల సమయంలో కేసీఆర్‌ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, కుటుంబపాలనే ఎజెండాగా పాలనగా సాగుతోందని మండిపడ్డారు.

దేవుడికి ఇచ్చిన హామీలను కూడా కేసీఆర్‌ నెరవేర్చలేదన్నారు. 1947 ఆగస్ట్‌ 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణ, మరాట్వాడా ప్రాంతాలకు మాత్రం రాలేదని, నిజాం పాలన అంతంతోనే తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చారని ఆయన గుర్తుచేశారు. సెప్టెంబర్‌ 17న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విమోచన దినోత్సవం ఎందుకు నిర్వహించడం లేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి రాగానే కేసీఆర్‌ విస్మరించిన హామీలను తాము అమలుచేసి తీరుతామని తెలిపారు. మహాకూటమి, టీఆర్‌ఎస్‌ పార్టీలు కేవలం అధికారం కోసమే పనిచేస్తున్నాయని, పేదల కొరకు పనిచేసే పార్టీ బీజేపీ మాత్రమేని అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top