50 చారిత్రక ప్రాంతాల అభివృద్ధి

Development of 50 Historical Areas  - Sakshi

పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

సాగర్‌ తీరాన ప్రపంచ బౌద్ధ సమ్మేళనం

నాగార్జునసాగర్‌: బౌద్ధమతవ్యాప్తికి తోడ్పడిన తెలంగాణలోని నాగార్జునసాగర్‌ తీరాన ప్రపంచ బౌద్ధమత సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. బుద్ధజయంతిని పురస్కరించుకుని శనివారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని శ్రీపర్వతారామంలో గల మహాçస్తూప ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సాగర్‌లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేల శిక్షణకార్యక్రమం సందర్భంగా శ్రీపర్వతారామాన్ని సందర్శించారని, ఆయన అప్పటికప్పుడు రూ.25 కోట్లు మంజూరు చేయడంతో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అనంతరం మరో 50 కోట్లు మంజూరు చేశారని తెలిపారు.

మరో వందకోట్ల నిధులు కేంద్రం నుంచి తెచ్చి రాష్ట్రంలోని 50 చారిత్రక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. అంతకుముందు ఆయన శ్రీలంకవాసులు ఏర్పాటు చేసిన బుద్ధుని పాదాల చెంత పుష్పగుఛ్చాలు ఉంచారు. ఈ కార్యక్రమంలో శ్రీలంక పార్లమెంటు సభ్యుడు వెన్‌.అతురల్యేరతన్‌తెరో, నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, బుద్ధవనం స్పెషల్‌ ఆఫీసర్‌ మల్లేపల్లి లక్ష్మయ్య, సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ రామచంద్రమూర్తి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పన్యాల భూపతిరెడ్డి, మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top