జీఎస్‌టీ మోసాలపై కొరడా

Department of Minerals and Measures Attacks On Malls And ShowRooms - Sakshi

తూనికలు, కొలతల శాఖ తనిఖీలు

36 మందితో 18 బృందాలు

62 కేసులు నమోదు  

సాక్షి,సిటీబ్యూరో: జీఎస్‌టీ మోసాలపై తూనికలు, కొలతల శాఖ కొరడా ఝులిపించింది. జీఎస్‌టీ తగ్గినా పాత ధరల ప్రకారమే వస్తువులను విక్రయిస్తున్న వ్యాపార, వాణిజ్య సంస్థలపై గురువారం దాడులు నిర్వహించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొన్ని వస్తువులపై జీఎస్‌టీ తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 28 శాతం ఉన్న జీఎస్‌టీ 18 శాతానికి తగ్గించడం, మరికొన్ని వస్తువులపై జీఎస్‌టీని ఎత్తి వేశారు. అయితే పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు యథావిధిగా పాత ధరల ప్రకారమే విక్రయాలు జరుపుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో తూనికల కొలతల శాఖ అధికారులు 36 మందితో 18 బృందాలుగా ఏర్పడి గ్రేటర్‌ పరిధిలో తనిఖీలు నిర్వహించారు. జీఎస్‌టీ ఉల్లంఘన, ఎంఆర్‌పీకి అదనంగా జీఎస్‌టి వసూలు, తగ్గిన జీఎస్‌టీ ధరలను అమలు చేయకపోవడం తదితర మోసాలను గుర్తించి 62 కేసులు నమోదు చేశారు. 

కేసులు ఇలా.
జీఎస్టీ ఉల్లంఘన, అదనపు వసూళ్లపై తూనికలు, కొలుతల శాఖ అధికారులు మల్కాజిగిరిలోని యష్‌ ఎలక్ట్రానిక్స్‌–1, షా ఎలక్ట్రానిక్స్‌–1, పంజాగుట్టలోని– ఏషియన్‌ ఎలక్ట్రానిక్స్‌–1, బంజారాహిల్స్‌లోని రిలయన్స్‌ డిజిటల్‌–3, తార్నాకలోని బిగ్‌బజార్‌–1, చిక్కడపల్లిలోని లోటస్‌ హోం నీడ్స్‌–1, మాధాపూర్‌లోని రిలయన్స్‌ మార్ట్‌–1, సరూర్‌నగర్‌లోని బజాజ్‌ హోం అప్లయెన్సెస్‌–3, సికింద్రాబాద్‌ లోని కోపాల్‌ కంప్యూటర్స్‌ అండ్‌ లాప్‌టాప్స్‌–1, ఆబిడ్స్‌లోని మెట్రో–1, 7స్టెప్ల్‌ ఫుట్‌వేర్‌–1, సెంట్రో–1,  మోచి–2, ఇసిఐఎల్‌ – మోర్‌ సూపర్‌ మార్కెట్‌–1, శ్రీ గురుకప గ్లాస్‌ ప్లైవుడ్‌ అండ్‌ హార్డ్‌వేర్‌–1, బాలానగర్‌లోని గౌరవ్‌ సూపర్‌ మార్కెట్‌–1, మలక్‌పేట్‌లోని వెంకటరమణ పెయింట్స్‌ అండ్‌ హార్డ్‌వేర్‌–3, శంషాబాద్‌లోని హనుమాన్‌ హార్డ్‌వేర్‌–1, భగవతి ట్రేడర్స్‌–1.లపై  కేసులు నమోదు చేశారు.  

జీఎస్టీ మోసాలపై కఠిన చర్యలు
కేంద్ర ప్రభుత్వం కొన్ని వస్తువులపై జీఎస్‌టీ తగ్గించినా ఆ ప్రయోజనాలు ప్రజలకు చేరకుండా కొందరు వ్యపారులు పాతధరలకే విక్రయాలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. కొత్త ధరల అమలుపై అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టాలి. తగ్గిన ధరలకు అనుగుణంగా వస్తువులను విక్రయించకపోతే ఆయా వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేయాలి.
–అకున్‌ సబర్వాల్‌తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top