రంగారెడ్డి జిల్లా తాండూరు ఐకేపీ డేటాఎంట్రీ ఆపరేటర్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సూసైడ్ నోట్ రాసి ఐకేపీ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆత్మహత్య
తాండూరు: రంగారెడ్డి జిల్లా తాండూరు ఐకేపీ డేటాఎంట్రీ ఆపరేటర్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘నా చావుకు తాండూరు మున్సిపల్ మాజీ కమిషనర్ గోపయ్య, అకౌంటెంట్ సుధాతన్‌బాబులే కారణం’ అని సూసైడ్ నోట్‌లో రాశాడు. పెద్దేముల్ మండలం గాజీపూర్‌వాసి జి.మహేష్(31) తాండూరు మున్సిపాలిటీలో డేటాఎంట్రీ ఆపరేటర్.
పింఛన్ల పంపిణీలో అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఫిర్యాదులపై కలెక్టర్ ఈ నెలాఖరున చేపట్టిన విచారణకు హాజరుకావాల్సి ఉంది. చేయని తప్పునకు బలిచేశారని మహేష్ బాధపడేవాడు. దీంతో బుధవారం తాండూరు-రుక్మాపూర్ మార్గంలో రైలు కిందపడి చనిపోయాడు.