సాగు బడ్జెట్‌ రూ.26,700 కోట్లు | Cultivation budget Rs .26,700 crore | Sakshi
Sakshi News home page

సాగు బడ్జెట్‌ రూ.26,700 కోట్లు

Feb 24 2017 3:29 AM | Updated on Sep 5 2017 4:26 AM

సాగు బడ్జెట్‌ రూ.26,700 కోట్లు

సాగు బడ్జెట్‌ రూ.26,700 కోట్లు

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన బడ్జెట్‌ తుది ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రాజెక్టుల పరిధిలో ప్రస్తుత పురోగతి, వాటి ప్రాధాన్య తలను పరిగణనలోకి తీసుకుంటూ

ప్రభుత్వానికి ప్రతిపాదించిన నీటిపారుదల శాఖ
కాళేశ్వరానికి రూ.9 వేల కోట్లు, పాలమూరుకు రూ.4,748 కోట్లు  


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన బడ్జెట్‌ తుది ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రాజెక్టుల పరిధిలో ప్రస్తుత పురోగతి, వాటి ప్రాధాన్య తలను పరిగణనలోకి తీసుకుంటూ బడ్జెట్‌ ప్రతిపాదనలను నీటి పారుదల శాఖ సిద్ధం చేసి గురువారం ప్రభుత్వానికి సమర్పిం చింది. మొత్తంగా రూ.26,700 కోట్లతో ప్రతి పాదనలు అందించింది. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టుకు అత్యధికంగా రూ.9వేల కోట్లు, పాలమూరు ప్రాజెక్టుకు రూ.4,748 కోట్లు ప్రతిపాదించింది.

రూ.4 వేల కోట్ల మేర కుదింపు...
నిజానికి గత ఏడాది డిసెంబర్‌లోనే నీటి పారుదల శాఖ రూ.31,300 కోట్లతో ప్రాథ మిక బడ్జెట్‌ అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికిచ్చింది. ఈ ప్రతిపాదనలపై అధ్యయనం చేసిన ఆర్థిక శాఖ ప్రస్తుతం జరుగుతున్న పను లు, భూసేకరణ అంశంతో ముడిç ³డివున్న ప్రాజె క్టులు, తక్షణ ఆయకట్టు నిచ్చే ప్రాజెక్టులు వంటి అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని తుది అంచనాలు సమర్పించాలని నీటిపారుదల శాఖకు సూచించింది. ఈ సూచనలకు అనుగుణంగా రూ.26,700 కోట్ల తో తాజా ప్రతిపాదనలు వెళ్లాయి. వీటిపై గురువారం సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌ అన్ని ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజనీర్లతో విడివిడిగా భేటీ నిర్వహించి పనులు, భూసే కరణ, సహాయ పునరావాసం, కరెంట్‌ చార్జీ లకు అవసరమైన నిధులపై చర్చించారు.

గత ప్రతిపాదనల్లో కాళేశ్వరానికి రూ.11 వేల కోట్ల ప్రతిపాదనలు ఇవ్వగా, ప్రస్తుత ప్రతిపాద నల్లో దాన్ని రూ.9 వేల కోట్లకు కుదించారు. పాలమూరుకు గతంలో రూ.6 వేల కోట్లు కేటాయించాలని కోరగా, ప్రస్తుతం రూ.4,748 కోట్లకు ప్రతిపాదనలు ఇచ్చారు. మహబూబ్‌ నగర్‌లోని కల్వకుర్తి, భీమా, నెట్టెం పాడులకు కలిపి రూ.1,300 కోట్ల మేర మొదట కోరినా ప్రస్తుతం రూ.1,100 కోట్లకు పరిమితమయ్యారు. ఇందులో నెట్టెంపాడుకు రూ.225 కోట్లు, కల్వకుర్తికి రూ.770 కోట్లు, భీమాకు రూ.200కోట్లు ప్రతిపాదించారు. మొత్తంగా గత ప్రతిపాదనలను రూ.4వేల కోట్ల మేర కుదించారు. ప్రస్తుతం బడ్జెట్‌ ప్రతిపాదనల్లో నాగార్జునసాగర్‌ పరిధి సీఈ కింద రూ.1,623 కోట్లు, ఆదిలాబాద్‌ సీఈ పరిధిలోని ప్రాజెక్టుకు రూ.1,591కోట్లు ప్రతి పాదించారు.

సాగునీటి శాఖకు ప్రతిపాదిం చిన బడ్జెట్‌లో సింహభాగం భూసేకరణకే అవసరం ఉంటుందని సాగునీటి శాఖ తేల్చి చెప్పింది. మొత్తంగా రూ.2,996 కోట్లు భూసేకరణకే అవసరమవుతాయని, సహాయ పునరావాస కార్యక్రమాలకు రూ.1,290 కోట్లు, విద్యుత్‌ చార్జీలకు రూ.1,065 కోట్ల మేర అవసరం ఉంటుందని తెలిపింది. వీటన్నింటిపై సమీక్షించిన స్మితా సబర్వాల్‌ ఇటీవల భూసేకరణపై ఇచ్చిన జీవో 38ను ఉపయోగించుకుని భూసేకరణ ప్రక్రియను వేగిరం చేయాలని, ప్రాజెక్టుల పూర్తికి చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించినట్లు నీటిపారుదల వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement