ఇక్కడ మండలి కాక.. అక్కడ కెవ్వుకేక..! | cruise tours to mlc poll oters | Sakshi
Sakshi News home page

ఇక్కడ మండలి కాక.. అక్కడ కెవ్వుకేక..!

Dec 22 2015 1:34 AM | Updated on Oct 22 2018 6:02 PM

ఇక్కడ మండలి కాక..  అక్కడ కెవ్వుకేక..! - Sakshi

ఇక్కడ మండలి కాక.. అక్కడ కెవ్వుకేక..!

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీల్లో టెన్షన్ తీవ్రమవుతోంది.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీల్లో టెన్షన్ తీవ్రమవుతోంది. అధిక ఓట్లు సాధించి విజయం దరిచేరేందుకు అభ్యర్థులు వ్యయప్రయాసలు పడుతుండగా.. నిర్ణయాన్ని వెల్లడించే ఓటర్లు మాత్రం విహారయాత్రల్లో మునిగితేలుతున్నారు. ఓటేసే వరకు సభ్యులు గాడితప్పకుండా ఉండేందుకు అభ్యర్థులు ఏకంగా క్యాంపులు ఏర్పాటుచేసి వారికి పూర్తిస్థాయిలో ఆహ్లాదాన్ని పంచుతున్నారు. ఈ క్రమంలో ఓటర్లు విహార యాత్రలు సాగిస్తూ.. విందు, వినోదాల్లో ఉబ్బితబ్బిపోతున్నారు. అక్కడి అనుభూతుల్ని సామాజిక మాధ్యమాల ద్వారా తమ స్నేహితులతో పంచుకుంటున్నారు. జిల్లాకు చెందిన పలువురు ఎంపీటీసీలు మైసూర్ ప్యాలెస్‌ను సందర్శించారు. అనంతరం అక్కడ దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేయగా.. క్షణాల్లో వైరల్ అయ్యాయి. - సాక్షి, రంగారెడ్డి జిల్లా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement