రైతులకు కరువు పింఛన్లు ఇచ్చి ఆదుకోవాలని సీపీఐ డిమాండ్ చేసింది.
కరీంనగర్: రైతులకు కరువు పింఛన్లు ఇచ్చి ఆదుకోవాలని సీపీఐ డిమాండ్ చేసింది. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, చిగురుమామిడి మండల కేంద్రాల్లో బుధవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు జరిగాయి. ప్రభుత్వం వెంటనే కరువు మండలాల్లో సహాయక చర్యలు ప్రారంభించాలని తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా చేశారు. అనంతరం పార్టీ నాయకులు అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు.