సంగీతంతో ఎక్కువ పాలు ఇస్తున్న ఆవులు

Cow Gave More Milk By Listening Music In Karimnagar - Sakshi

సాక్షి, జగిత్యాల: పురాణాల్లో సంగీతాన్ని భగవంతుడిగా భావించడం జరిగింది. పెద్దవ్యాధులు కూడా సంగీతం వల్ల నయమవుతాయన్న విషయాన్ని ఆయుర్వేదం చెప్పింది. పశువులు కూడా సంగీతపు ఆనందాన్ని ఆస్వాదిస్తాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. పాలు పితికే సమయంలో మధుర సంగీతాన్ని ఆలపిస్తే..పాల దిగుబడి పెరుగుతుంది. ఇప్పటికే ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి వంటి కొన్ని దేవాలయాల గోశాలలో, కొన్ని డైరి ఫారాలలో ఈ పద్ధతి ఆచరిస్తున్నారు.

మహారాష్ట్రలోని పూనే వద్ద కల పరాగ్‌ మిల్క్‌ ఫుడ్స్‌లో పాలు పితికే సమయాల్లో గాయకులు కిశోర్‌కుమార్, మహ్మాద్‌ రఫీల పాటల సీడీలు వేస్తున్నారు. దీంతో ఆవుల చెవులకు ఇంపైన సంగీతం వినిపిస్తే పాల దిగుబడి 3 శాతం పెరిగిందని పరాగ్‌ పుడ్స్‌ సీఎంఓ మహేష్‌ ఇస్రాని తెలిపారు. బారామతిలోని ఫ్రైబర్‌ డైనామిక్స్‌ డెయిరీ ఫాంలో కూడా ఆవులకు సితార్, తబలా సంగీతం వినిపిస్తున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top