కలెక్టర్‌ వాహనం జప్తునకు కోర్టు ఆదేశం | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 25 2018 10:22 AM

Court Order To Seize Peddapalli Collector Vehicle - Sakshi

ఒకటి కాదు...రెండు కాదు... ఏకంగా పాతికేళ్లుగా పరిహారం కోసం బాధితులు పోరాడుతు న్నారు. ప్రభుత్వం సేకరించిన తమ భూమికి తగిన పరిహారం ఇవ్వాలంటూ ఏళ్లుగా వేడుకుం టున్నారు. పరిహారం కోసం తొలుత కార్యాలయాల చుట్టూ తిరిగిన చాలా మంది కాలం చేశారు. కానీ ఇప్పటికీ ఆ కుటుంబాలకు పరిహారం అందనే లేదు. రెవెన్యూ విభాగంలో అంతులేని నిర్లక్ష్యంపై కోర్టు పలుమార్లు మెట్టికాయలు వేసింది. అయినా స్పందన రావడం లేదు. చివరికి  కలెక్టర్‌ వాహనం జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈనెల 28లోగా వాహనాన్ని అటాచ్‌ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. 

సాక్షి, పెద్దపల్లి:  రామగుండం మండలం జనగామ శివారులో 1994లో వాటర్‌ట్యాంక్‌ నిర్మించారు. సర్వేనంబర్‌ 599లో ఎకరా పది గుంటల భూమిని వాటర్‌ట్యాంక్‌ నిర్మాణానికి ప్రభుత్వం సేకరించింది. ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం నిర్ణయించింది. అయితే ఆ పరిహారం తమకు ఆమోదయోగ్యం కాదంటూ గౌసియా బేగం తదితర కుటుంబాలు కోర్టుకు వెళ్లాయి. ఇందుకు స్పందించిన కోర్టు ఎకరాకు రూ.3.50లక్షల చొప్పున చెల్లించాలంటూ 2012 జూలై 31న తీర్పునిచ్చింది. అన్ని లెక్కలు కలిపి మొత్తం రూ.31లక్షల 24వేల 968 పరిహారం కింద చెల్లించాలని పెద్దపల్లి కోర్టు తేల్చింది. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు ఎ లాంటి చెల్లింపులు జరపలేదు. సంవత్సరాలు గడుస్తున్నా సమస్య కొలిక్కిరాలేదు. తమకు రావాల్సిన పరిహారం కోసం తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్తే.. ఇప్పుడు, అప్పుడు అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు.

కలెక్టర్‌ వాహనం జప్తు చేయాలని ఆదేశం 
పరిహారం కోసం పోరాటం చేస్తున్న బాధిత కుటుంబాలకు కోర్టు బాసటగా నిలిచింది. మొ త్తం రూ.31,24,968 పరిహారం చెల్లించాలని ఆదేశించింది. పరిహారంపై రెవెన్యూ అధికారులు అదే రీతిన నిర్లక్ష్యం చేస్తుండడంతో జిల్లా కలెక్టర్‌ వాహనం జప్తు చేయాలంటూ పెద్దపల్లి సీనియర్‌ సివిల్‌ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. వరుస సెలవులు రావడంతో ఈనెల 28లోగా కలెక్టర్‌ వాహ నం జప్తు చేసే అవకాశం ఉంది. అయితే ఆ లోగా నే డబ్బులు చెల్లించి, వ్యవహారం కలెక్టర్‌ వాహ నం జప్తు కాకుండా చూసేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలోనూ రామగుండం తహసీల్దార్‌ కార్యాలయం లోని సామగ్రిని జప్తు చేయాలని కోర్టు 2016లో ఆదేశించింది. దీంతో కార్యాలయంలోని కంప్యూటర్, బీరువాలు, టేబుళ్లను బాధితులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని వేలం వేయాల్సి ఉండగా, రూ.84,500 చెల్లించి ప్రభుత్వమే తిరిగి కొనుగోలు చేసింది. సామగ్రి విలువ ప్రకారం చెల్లించి న, పరిహారం మాత్రం పూర్తిగా దక్కలేదు. మళ్లీ రెండేళ్ల తర్వాత ఏకంగా కలెక్టర్‌ వాహనాన్ని పరిహారం కింద జప్తు చేయాలని కో ర్టు ఆదేశించడం సంచలనంగా మారింది. కాగా పాతికేళ్లుగా పరిహారం ఇవ్వకుండా తమను మా నసికంగా వేధిస్తున్నారని, ఇప్పటికైన పూర్తి పరిహారం ఇవ్వాలని బాధితులు వేడుకొంటున్నారు. 

జప్తు కానివ్వం 
కలెక్టర్‌ వాహనం జప్తు కావట్లేదు. మేమున్నంత వరకు జప్తు కానివ్వం. ప్రజా ఆరోగ్యశాఖ డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఆ శాఖ డబ్బులు చెల్లించకపోవడంతో కొంత ఇబ్బంది ఏర్పడింది. ఇప్పుడు మున్సిపల్‌ (ప్రజా ఆరోగ్యశాఖ) నుంచి రూ.10 లక్షల చెక్‌ను కోర్టుకు పంపిస్తున్నాం. ఏ వాహనం కూడా జప్తు కాదు.–పుప్పాల హన్మంతరావు, తహసీల్దార్, రామగుండం  

Advertisement
Advertisement