కానిస్టేబుల్ను దారుణంగా హతమార్చారు | constable brutally murdered, says si venkat reddy | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్ను దారుణంగా హతమార్చారు

Aug 16 2014 10:05 AM | Updated on Mar 19 2019 5:56 PM

ఆత్మరక్షణ కోసం మాత్రమే తాము నకిలీనోట్ల ముఠాపై కాల్పులు జరపాల్సి వచ్చిందని శామీర్పేట ఘటనలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న ఎస్ఐ వెంకటరెడ్డి చెప్పారు.

ఆత్మరక్షణ కోసం మాత్రమే తాము నకిలీనోట్ల ముఠాపై కాల్పులు జరపాల్సి వచ్చిందని శామీర్పేట ఘటనలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న ఎస్ఐ వెంకటరెడ్డి చెప్పారు. సిద్దిపేట కేంద్రంగానే నకిలీ నోట్లు చెలామణి అవుతున్నాయని, ఈ రాకెట్కు ఎల్లంగౌడే ప్రధాన సూత్రధారి అని ఆయన అన్నారు. ముందుగా తాము రఘు, నరేష్‌లను అదుపులోకి తీసుకున్నామని, వాళ్లను విడిపించుకునేందుకు శ్రీకాంత్‌, ఎల్లంగౌడ్‌, ముస్తాఫాలు శామీర్‌పేటకు వచ్చారని, అప్పుడు వస్తూ వస్తూనే ముస్తాఫా దాడిచేశాడని వెంకటరెడ్డి తెలిపారు.

కానిస్టేబుల్ ఈశ్వరరావును వాళ్లు దారుణంగా హత్యచేశారని, ఎల్లంగౌడ్‌ను పట్టుకునేందుకు తాము తీవ్రంగా ప్రయత్నించి.. ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపామని ఆయన వివరించారు. తాము పోలీసులమని గ్రహించి ఎల్లంగౌడ్‌, శ్రీకాంత్‌లు అక్కడి నుంచి పరారయ్యారని వెంకటరెడ్డి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement