Fake notes case
-
నకిలీ నోట్ల కేసు నిందితుడు అక్బర్ అలీ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : 2015 విశాఖ నకిలీ నోట్ల కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ అక్బర్ అలీని పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొద్దికాలంగా అజ్ఞాతంలో ఉన్న అక్బర్‌ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అస్సాంకు చెందిన మహ్మద్ అక్బర్ అలీ 2007లో బెంగళూరుకు వచ్చి స్థిరపడ్డాడు. పువ్వుల అమ్మే షాపులో పనిచేసుకునే అక్బర్! హకీమ్ అనే వ్యక్తి ద్వారా నకిలీ నోట్ల దందాలోకి దిగాడు. ఆ తర్వాత సొంతంగా ఒక గ్రూపును తయారుచేసుకుని దంగా చేసేవాడు. 2015 సంవత్సరంలో ఈ ముఠాకు చెందిన సద్దాం హశ్సేన్ అనే వ్యక్తి దొంగ నోట్లు తరలిస్తుండగా విశాఖపట్నంలో పట్టుబడ్డాడు. అతని వద్దనుంచి 5లక్షల నకిలీ నోట్లు స్వాధీనపరుచుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో ఈ కేసులో అక్బర్ ప్రధాన నిందితుడని తేలింది. అయితే పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్న అతడు అజ్ఞాతంలోకి వెళ్లాడు. అక్బర్ కోసం శ్రమించిన పోలీసులు అతని కదలికను పసిగట్టి పట్టుకున్నారు. -
దొంగనోట్ల కేసులో నిందితుడిపై కత్తులతో దాడి
హైదరాబాద్: దొంగనోట్ల కేసులో ప్రధాన నిందితుడు ఎల్లంగౌడ్‌పై ప్రత్యర్థులు విచక్షణా రహితంగా దాడి చేసింది. కత్తులతో దాడిచేయడంతో ఎల్లంగౌడ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఎల్లంగౌడ్‌ను సికింద్రాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. 2014 సంవత్సరం శామీర్‌పేట్‌లో ఎల్లంగౌడ్ పోలీసులపై దాడి చేశాడు. ఈ సంఘటనలో ఈశ్వరయ్య అనే కానిస్టేబుల్ మృతిచెందగా..ఎస్ఐ వెంకట్ రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసు కాల్పుల్లో ఎల్లంగౌడ్ గ్యాంగ్ సభ్యుడు కూడా మృతిచెందాడు. అప్పటి నుంచి ఎల్లంగౌడ్ పరారీలో ఉన్నాడు. ఇటీవల ఎల్లంగౌడ్‌ను మహారాష్ట్రలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడి నేపథ్యంలో మరో మారు ఎల్లంగౌడ్ తెరపైకి వచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నకిలీ నోట్ల సూత్రధారి ఎల్లంగౌడ్ అరెస్టు
-
నకిలీ నోట్ల సూత్రధారి ఎల్లంగౌడ్ అరెస్టు
నగరంలో సంచలనం సృష్టించిన నకిలీ నోట్ల కేసులో పోలీసులు గణనీయమైన పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎల్లంగౌడ్ అరెస్టయ్యాడు. అతడిని ఎస్ఓటీ పోలీసులు మహారాష్ట్రలో అరెస్టు చేశారు. ఈ నెల నాలుగో తేదీన హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేట ప్రాంతంలో ఎల్లంగౌడ్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఎల్లంగౌడ్ పోలీసుల మీదే కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అతడి అనుచరుడితో పాటు కానిస్టేబుల్ కూడా మృతి చెందారు. ఇదే కాల్పుల్లో ఎస్ఐ వెంకట్ రెడ్డి కూడా తీవ్రంగా గాయపడి చాలాకాలం పాటు చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఎల్లంగౌడ్ అరెస్టు కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎల్లంగౌడ్ మహారాష్ట్రకు పారిపోయి ఉంటాడనే పోలీసులు అనుమానిస్తున్నారు. అతడు తరచు తన భార్యకు ఫోన్ చేస్తుండటంతో ఆమె కాల్ డేటా ఆధారంగా అతడున్న ప్రాంతం వివరాలు సేకరించి అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు. అయితే, అతడు స్వయంగా కమిషనర్ ముందు లొంగిపోయాడన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. -
కానిస్టేబుల్‌ను దారుణంగా హతమార్చారు
ఆత్మరక్షణ కోసం మాత్రమే తాము నకిలీనోట్ల ముఠాపై కాల్పులు జరపాల్సి వచ్చిందని శామీర్‌పేట ఘటనలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న ఎస్ఐ వెంకటరెడ్డి చెప్పారు. సిద్దిపేట కేంద్రంగానే నకిలీ నోట్లు చెలామణి అవుతున్నాయని, ఈ రాకెట్‌కు ఎల్లంగౌడే ప్రధాన సూత్రధారి అని ఆయన అన్నారు. ముందుగా తాము రఘు, నరేష్‌లను అదుపులోకి తీసుకున్నామని, వాళ్లను విడిపించుకునేందుకు శ్రీకాంత్, ఎల్లంగౌడ్, ముస్తాఫాలు శామీర్‌పేటకు వచ్చారని, అప్పుడు వస్తూ వస్తూనే ముస్తాఫా దాడిచేశాడని వెంకటరెడ్డి తెలిపారు. కానిస్టేబుల్ ఈశ్వరరావును వాళ్లు దారుణంగా హత్యచేశారని, ఎల్లంగౌడ్‌ను పట్టుకునేందుకు తాము తీవ్రంగా ప్రయత్నించి.. ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపామని ఆయన వివరించారు. తాము పోలీసులమని గ్రహించి ఎల్లంగౌడ్, శ్రీకాంత్‌లు అక్కడి నుంచి పరారయ్యారని వెంకటరెడ్డి చెప్పారు. -
నకిలీ నోట్ల కేసులో టీడీపీ నేత పేరు
విజయవాడ: కృష్ణా జిల్లా కలిదిండిలో నకిలీ నోట్ల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 2 లక్షలా 28 వేల రూపాయిలు నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పేపర్ కట్టర్, కంప్యూటర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. హౌరా నుంచి వీటిని తీసుకువచ్చినట్టు నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు. లక్ష నకిలీ నోట్లకు 50 వేల రూపాయిలు ఇచ్చి మార్పిడి చేసుకున్నట్టు వెల్లడించారు. ముదినేపల్లి టీడీపీ జెడ్సీటీసీ నాగకల్యాణి భర్త రవీంద్రబాబుకు 15 లక్షల నకిలీ నోట్లను ఇచ్చామని నిందితులు తెలిపారు.