దొంగనోట్ల కేసులో నిందితుడిపై కత్తులతో దాడి

Opponents Attack On Fake Note Scam Accused Ellam Goud In Secunderabad - Sakshi

హైదరాబాద్‌: దొంగనోట్ల కేసులో ప్రధాన నిందితుడు ఎల్లంగౌడ్‌పై ప్రత్యర్థులు విచక్షణా రహితంగా దాడి చేసింది. కత్తులతో దాడిచేయడంతో ఎల్లంగౌడ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఎల్లంగౌడ్‌ను సికింద్రాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. 2014 సంవత్సరం శామీర్‌పేట్‌లో ఎల్లంగౌడ్‌ పోలీసులపై దాడి చేశాడు. ఈ సంఘటనలో ఈశ్వరయ్య అనే కానిస్టేబుల్‌ మృతిచెందగా..ఎస్‌ఐ వెంకట్‌ రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి.

పోలీసు కాల్పుల్లో ఎల్లంగౌడ్‌ గ్యాంగ్‌ సభ్యుడు కూడా మృతిచెందాడు. అప్పటి నుంచి ఎల్లంగౌడ్‌ పరారీలో ఉన్నాడు. ఇటీవల ఎల్లంగౌడ్‌ను మహారాష్ట్రలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ దాడి నేపథ్యంలో మరో మారు ఎల్లంగౌడ్‌ తెరపైకి వచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top