గులాబీ గూటికి కాంగ్రెస్ సీనియర్ నేత? | congress senior leader joins in trs | Sakshi
Sakshi News home page

గులాబీ గూటికి కాంగ్రెస్ సీనియర్ నేత?

Jun 30 2015 5:12 AM | Updated on Aug 30 2019 8:24 PM

నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ దిగ్గజం, మాజీ మంత్రి ఒకరు టీఆర్‌ఎస్ గూటికి చేరనున్నట్లు అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.

 సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ దిగ్గజం, మాజీ మంత్రి ఒకరు టీఆర్‌ఎస్ గూటికి చేరనున్నట్లు అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో సంప్రదింపులు కూడ జరిపినట్లు సమాచారం. కేసీఆర్ సైతం సదరు నేత చేరికకు పచ్చాజెండా ఊపినట్లు తెలిసింది. కేసీఆర్ తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఆ నేత చేరికను ఆహ్వానించినట్లు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన సదరు నేత కొద్ది రోజులుగా ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

తెలంగాణ  రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమాల్లో కీలక పాత్ర వహించి లాఠీ దెబ్బలు తిన్నాననే కాంగ్రెస్ దిగ్గజం చివరకు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం నిజామాబాద్ జిల్లా రాజకీయవర్గాల్లో హాట్‌టాఫిక్‌గా మారింది. సోమవారం నిజామాబాద్‌లోని వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతల్లో ఈ చర్చే సాగింది. రెండు, మూడు రోజుల్లో ఆ నేత చేరిక అధికారికంగా వెల్లడికాను ందని కూడ మాట్లాడుకున్నారు. అయితే సదరు నేత చేరికపై గ్రామీణ ప్రాంతానికి చెందిన టీఆర్‌ఎస్ శాసనసభ్యులు ఒకరు గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement