కేసీఆర్‌ ఎముకలు కూడా వదలడం లేదు: డీకే | congress mla DK Aruna takes on kcr over batukamma sarees | Sakshi
Sakshi News home page

‘కేసీఆర్‌ ఎముకలు కూడా వదలడం లేదు’

Sep 19 2017 1:31 PM | Updated on Aug 15 2018 9:40 PM

కేసీఆర్‌ ఎముకలు కూడా వదలడం లేదు: డీకే - Sakshi

కేసీఆర్‌ ఎముకలు కూడా వదలడం లేదు: డీకే

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుపై గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


సాక్షి, హైదరాబాద్ ‌: తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుపై గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రా పాలకులు తోలు మింగితే ఇప్పుడు కేసీఆర్‌ ఎముకలను కూడా వదలడం లేదని ఆమె విమర్శించారు. మంగళవారం డీకే అరుణ గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘చీరలు కాల్చారని ఆరోపిస్తూ మహిళల పై కేసులు పెట్టడం అమానుషం. మహిళలపై పెట్టిన కేసులను తక్షణమే విత్‌డ్రా చేయాలి. నాసిరకం బతుకమ్మ చీరలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. దానికి బదులు మహిళల అకౌంట్లలో డబ్బులు వేయాలి. ప్రజల సొమ్మును దోచుకుంటుంటే కాంగ్రెస్‌ చూస్తూ ఊరుకోదు.

రాష్ట్ర మహిళా లోకాన్ని అగౌరవ పరిచిన టీఆర్‌ఎస్‌కు ప్రజలే బుద్ధి చెప్తారు. కేసీఆర్‌ కుమార్తె, ఎంపీ కవిత ఈ చీరలే కట్టుకొని బతుకమ్మ ఆడుతుందా? ప్రతిపక్షాలను దూషించడం కాదు ముందు మీ తీరు మార్చుకోండి’ అని హితవు పలికారు. టీపీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి భార్య, ఎమ్మెల్యే ఉత్తమ్‌ పద్మావతి రెడ్డి మాట్లాడుతూ.. నాసిరకమే కాకుండా తక్కువ సైజ్‌ చీరలు ఇచ్చి మహిళలను అగౌరవ పరిచారని, మహిళలకు ఎంత చీర కావాలో కూడా ప్రభుత్వ పెద్దలకు తెలియదా అని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement