నిజామాబాద్‌లో.. పేపర్‌ బ్యాలెట్‌తోనే నిర్వహించాలి

Conduct Paper Ballot Polling In Nizamabad Said By Farmer MP Candidates - Sakshi

ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న రైతుల డిమాండ్‌ 

ఈవీఎంల తనిఖీ కేంద్రం వద్ద ఆందోళన.. 

సుభాష్‌నగర్‌: నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి పేపర్‌ బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల్లో పోటీ చేస్తున్న రైతులు డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌తో నగరశివారులోని విజయలక్ష్మి ఫంక్షన్‌హాల్లో ఈవీఎంలపై అవగాహన కల్పించే కేంద్రం వద్ద ఆందోళన చేశారు. ఈవీఎంలు వద్దు.. బ్యాలెట్‌ ముద్దు అంటూ నినాదాలు చేశారు.  అభ్యర్థులైన రైతులు మాట్లాడుతూ తమకు ఈవీఎంలపై నమ్మకం లేదని, కుట్రలు జరిగే అవకాశముందని ఆరోపించారు. బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తే న్యాయం జరుగుతుందన్నా రు.

ఏర్పాట్లు చేసేందుకు సమయం లేకుంటే ఎన్నికలను వాయిదా వేయాల ని డిమాండ్‌ చేశారు. అంతేగాకుండా బరిలో నిలిచిన రైతు అభ్యర్థులు కొంత మందికి ఇంకా అధికారికంగా గుర్తు కేటాయించలేదని, తాము ఎప్పుడు ప్రచారం చేసుకోవాలని ప్రశ్నించారు. రైతులంటే అధికారులు, ప్రభుత్వానికి చులకనగా ఉందని ఆరోపించారు. ఉదయం 11 గంటలకు ఈవీఎంలపై అవగాహన కేంద్రానికి చేరుకోవాలని నోటీసులిచ్చి.. తీరా సాయంత్రం 5 గంటలకు రావాలని సూచించడంతో అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంపీ అభ్యర్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా రైతు అభ్యర్థులను చుల కనగా చూస్తున్నారని ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. సీపీ కార్తికేయ జోక్యం చేసుకుని కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో అధికార యంత్రాం గం పనిచేస్తుందని, సంయమనం పాటించి సహకరించాలని కోరారు. దీంతో వారు ఆందోళన విరమించి కేం ద్రంలోకి వెళ్లారు. అనంతరం సాయం త్రం మరోమారు ఆందోళన చేశారు. ఎంపీ అభ్యర్థులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఈవీఎంలపై అవగాహన కల్పించడంలో ఆలస్యం, తదితర అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈవీఎం తనిఖీ కేంద్రం పరిశీలన.. 
కేంద్ర డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ సుదీప్‌ జైన్‌ ఈవీఎం తనిఖీ నిర్వహిస్తున్న కేంద్రం, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఏర్పాట్లపై అన్ని విషయాలను వివరించారు. ఫంక్షన్‌ హాల్లో నిర్వహిస్తున్న ఈవీఎం చెకింగ్‌ల ప్రక్రియ, ఏర్పాట్లను తెలియజేశారు. ఎం–3 ఈవీఎంలపై ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఆయా శాఖల ఉద్యోగులకు అవగాహన కల్పించారు. కాగా బుధవారం రాత్రి 7.30 తర్వాత ఎం–3 ఈవీఎంలు సుమారు 15 ట్రక్కుల్లో జిల్లాకు చేరుకున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top