విజయనిర్మల భౌతికకాయానికి సీఎం జగన్‌ నివాళి | CM YS Jagan Pays Tribute To Vijaya Nirmala | Sakshi
Sakshi News home page

విజయనిర్మల భౌతికకాయానికి సీఎం జగన్‌ నివాళి

Jun 28 2019 9:43 AM | Updated on Jun 28 2019 2:34 PM

CM YS Jagan Pays Tribute To Vijaya Nirmala - Sakshi

అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు.

సాక్షి, హైదరాబాద్‌: అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. నానక్‌రామ్‌గూడలోని సీనియర్‌ నటుడు కృష్ణ నివాసానికి చేరుకుని విజయనిర్మల భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. తెలుగు సినిమా రంగానికి విజయనిర్మల చేసిన సేవలను స్మరించుకున్నారు. కృష్ణ, నరేశ్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భార్య మరణంతో కన్నీమున్నీరుగా విలపిస్తున్న కృష్ణను ఓదార్చారు. తన తల్లికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అంటే ఎంతో అభిమానమని సీఎం జగన్‌కు నరేశ్‌ తెలిపారు. సీఎం జగన్‌ వెంట వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వి. విజయసాయిరెడ్డి అన్నారు.



నానక్‌రాంగూడ నుంచి విజయనిర్మల అంతిమయాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. విజయనిర్మల భౌతికకాయానికి అంత్యక్రియలు శుక్రవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం చిలుకూరులో జరగనున్నాయి. చిలుకూరులో ఉన్న ఫాంహౌస్‌లో ఈ మధ్యాహ్నం 12 గంటలకు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


కృష్ణను పరామర్శిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement