హైదరాబాద్‌కు చెందిన ఓ నిరుపేద విద్యార్థిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఔదార్యం చూపించారు.
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ఓ నిరుపేద విద్యార్థిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఔదార్యం చూపించారు. నగరంలోని మాదన్నపేటకు చెందిన రేణుక కూరగాయాల వ్యాపారి. ఆమె కుమారుడు రాకేశ్‌కుమార్ బీఫార్మసీలో 59.3 శాతం మార్కులు సాధించాడు. విదేశాల్లో చదివేందుకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
నిబంధనల ప్రకారం 60 శాతం మార్కులుంటేనే స్కాలర్‌షిప్ వస్తుంది. నిరుపేద విద్యార్థి రాకేశ్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సీఎం ప్రత్యేక అనుమతితో స్కాలర్‌షిప్ మంజూరు చేశారు.