
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో కలుకున్నారు. పలు కీలక అంశాలపై చర్చించేందుకు సీఎం గవర్నర్‌తో భేటీ అయినట్టు తెలుస్తోంది. సచివాలయం కూల్చివేత, నూతన సచివాలయ నిర్మాణం, కరోనా నివారణ చర్యలు, రోగులకు అందుతున్న చికిత్స విధానాలను గవర్నర్‌కు సీఎం వివరించినట్టు సమాచారం. దీంతోపాటు గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ విషయమై సీఎం గవర్నర్‌తో చర్చించే అవకాశముంది. ఇక కరోనా పరీక్షలు, చికిత్సపై రాష్ట్ర హైకోర్టు పదేపదే మొట్టికాయలు వేయడం, విపక్షాల విమర్శల నేపథ్యం ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
(తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు)