ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇచ్చిన హామీల అమలులో సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆరోపించారు.
-వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
హైదరాబాద్ : ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇచ్చిన హామీల అమలులో సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆరోపించారు. శనివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడంలో సర్కార్ వైఫల్యం చెందడంతో పాటు వాటిని నిర్లక్ష్యం చేస్తుందని వెంకటేశ్వర్లు ఈ సంర్భంగా అన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీ సాక్షిగా టీఆర్ఎస్ సర్కార్‌ను నిలదీస్తామని ఆయన తెలిపారు.