మోదీ ఫోటో పెట్టి ఫౌండేషన్‌ పేరుతో.. | cid police arrest the namo foundation director in hyderabad | Sakshi
Sakshi News home page

మోదీ ఫోటో పెట్టి ఫౌండేషన్‌ పేరుతో..

Apr 13 2017 7:43 PM | Updated on Sep 4 2018 5:07 PM

నమో(నరేంద్ర మోదీ)ఫౌండేషన్‌ పేరుతో విరాళాలు సేకరించి మోసాలకు పాల్పడుతున్న నిర్వాహకుడు పంకత్‌ మెహ్తాను సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

- సామాజిక సేవ ముసుగులో విరాళాల సేకరణ
- ప్రధాని కార్యాలయంలో ఫిర్యాదు చేసిన మహిళ
 
హైదరాబాద్‌: నమో(నరేంద్ర మోదీ)ఫౌండేషన్‌ పేరుతో విరాళాలు సేకరించి మోసాలకు పాల్పడుతున్న నిర్వాహకుడు పంకత్‌ మెహ్తాను గురువారం సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గత నెలలో సికింద్రాబాద్‌కు చెందిన సరోజ జైన్‌ అనే మోదీ అభిమానురాలు నమో ఫౌండేషన్‌ పేరుతో దోపిడికి పాల్పడుతున్నారని నేరుగా ప్రధాని మోదీ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. నమో ఫౌండేషన్‌తో ప్రధాని కార్యాలయానికిగానీ, బీజేపీకి గానీఎలాంటి  సంబంధాలులేవని  పీఎంఓ కార్యాలయం ధృవీకరిస్తూ సీఐడీ విచారణ జరపాలని డీజీపీ అనురాగ్‌ శర్మను ఆదేశించింది.

దీనితో రంగంలోకి దిగిన సీఐడీ, సంబంధిత సరోజ జైన్‌ నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదుచేసింది. సరోజ జైన్‌ నమో ఫౌండేషన్‌కు రూ.12.5లక్షలు విరాళంగా ఇచ్చారని, ఆ విరాళంతో ఏయే కార్యక్రమాలు చేశారో తెలిపాలని ఆమె అడిగినందుకు సంబంధిత ఫౌండేషన్‌ నిర్వహకులు బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. అదే విధంగా మోదీ ఫోటో పెట్టి ఫౌండేషన్‌ పేరుతో అమాయకులకు బురిడీ కొట్టిస్తున్నారని సీఐడీ గుర్తించింది. దీనితో విచారణ జరిపిన సీఐడీ శుక్రవారం దిల్‌షుక్‌నగర్‌లోని ఫౌండేషన్‌ కార్యాలయంలో సోదాలు నిర్వహించి బాధ్యుడిగా ఉన్న పంకజ్‌ మెహ్తాను అరెస్ట్‌ చేసినట్టు అధికారులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement