breaking news
Namo Foundation
-
‘నమో ఫుడ్స్’పై ఎన్నికల స్టంట్
మామూలు విషయాలు కూడా ఎన్నికల సమయంలో వివాదాలకు దారి తీస్తాయనడానికి ఉదాహరణ ‘నమో ఫుడ్స్’. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులకు ఇచ్చిన ఆహార పొట్లాలపై ఉన్న ‘నమో ఫుడ్స్’ అనే లేబుల్ రాజకీయ వివాదం రేపింది. ‘నమో’ అంటే ప్రధాని నరేంద్ర మోదీ పేరుకు సంక్షిప్త రూపమని, ఆ పొట్లాల ద్వారా పరోక్షంగా బీజేపీకి ప్రచారం చేశారని విపక్షాలతో పాటు పలువురు విమర్శించారు. అయితే ఆ పేరుకు ప్రధానికి, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని ఆ కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమబుద్ధనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో గురువారం మొదటి దశ పోలింగ్ జరిగింది. నోయిడాలోని ఒక పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు ఆహార పొట్లాలు అందాయి. వాటిపై హిందీలో ‘నమో’ అని పెద్దక్షరాలతో ‘ఫుడ్స్’ అని చిన్నక్షరాలతో ఉండటంతో వివాదం రేగింది. అది బీజేపీ ప్రచారమని కొందరంటే, మరికొందరు దీనికి రాజకీయాలకు అంటగట్టొద్దని చెప్పుకొచ్చారు. ఈ వివాదంపై కంపెనీ మేనేజర్ సునీల్ ఆనంద్ స్పందిస్తూ, ఆ పొట్లాలకు రాజకీయాలకు సంబంధం లేదన్నారు. నోయిడా పోలీసులు తమకు 750 తాలీలు ఆర్డరిచ్చారని, ఆ మేరకు వాటిని పంపామని అన్నారు. తమ కంపెనీ పేరు ‘నమో ఫుడ్స్’ అని దీనికి మోదీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. నోయిడాలో తమకు చాలా దుకాణాలున్నాయని కూడా చెప్పారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగు రోజున పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో ఏ రాజకీయ పార్టీకి లేదా అభ్యర్థికి సంబంధించిన ప్రచార సామగ్రి కనబడకూడదు. ఈ విషయమై బీజేపీ ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించిందంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం కొట్టిపడేసింది. ఈ నియోజకవర్గంలో బీజేపీ నుంచి మహేశ్‌శర్మ, కాంగ్రెస్ నుంచి అరవింద్ కుమార్ తలపడుతున్నారు. -
మోదీ ఫోటో పెట్టి ఫౌండేషన్ పేరుతో..
- సామాజిక సేవ ముసుగులో విరాళాల సేకరణ - ప్రధాని కార్యాలయంలో ఫిర్యాదు చేసిన మహిళ హైదరాబాద్: నమో(నరేంద్ర మోదీ)ఫౌండేషన్ పేరుతో విరాళాలు సేకరించి మోసాలకు పాల్పడుతున్న నిర్వాహకుడు పంకత్ మెహ్తాను గురువారం సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెలలో సికింద్రాబాద్‌కు చెందిన సరోజ జైన్ అనే మోదీ అభిమానురాలు నమో ఫౌండేషన్ పేరుతో దోపిడికి పాల్పడుతున్నారని నేరుగా ప్రధాని మోదీ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. నమో ఫౌండేషన్‌తో ప్రధాని కార్యాలయానికిగానీ, బీజేపీకి గానీఎలాంటి సంబంధాలులేవని పీఎంఓ కార్యాలయం ధృవీకరిస్తూ సీఐడీ విచారణ జరపాలని డీజీపీ అనురాగ్ శర్మను ఆదేశించింది. దీనితో రంగంలోకి దిగిన సీఐడీ, సంబంధిత సరోజ జైన్ నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదుచేసింది. సరోజ జైన్ నమో ఫౌండేషన్‌కు రూ.12.5లక్షలు విరాళంగా ఇచ్చారని, ఆ విరాళంతో ఏయే కార్యక్రమాలు చేశారో తెలిపాలని ఆమె అడిగినందుకు సంబంధిత ఫౌండేషన్ నిర్వహకులు బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. అదే విధంగా మోదీ ఫోటో పెట్టి ఫౌండేషన్ పేరుతో అమాయకులకు బురిడీ కొట్టిస్తున్నారని సీఐడీ గుర్తించింది. దీనితో విచారణ జరిపిన సీఐడీ శుక్రవారం దిల్‌షుక్‌నగర్‌లోని ఫౌండేషన్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి బాధ్యుడిగా ఉన్న పంకజ్ మెహ్తాను అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. -
‘నమో’ ఫౌండేషన్ పేరిట దోపిడీ
ఓ మహిళ నుంచి రూ.12.5 లక్షలు వసూలు ►ప్రధాని కార్యాలయంలో ఫిర్యాదు చేసిన ఆ మహిళ కుటుంబం ►నమో ఫౌండేషన్‌తో మోదీకి ఎలాంటి సంబంధం లేదన్న పీఎంవో ►విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం ►కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు ►దాదాపు 200 మంది నుంచి భారీగా వసూళ్లు చేసినట్లు గుర్తింపు! సాక్షి, హైదరాబాద్: నమో (నరేంద్ర మోదీ) ఫౌండేషన్ పేరుతో కొందరు వ్యక్తులు అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారని సీఐడీ గుర్తించింది. మోదీపై ఉన్న అభిమానాన్ని అడ్డుపెట్టుకుని.. అనాథ పిల్లలకు చదువు, గోశాలల నిర్వహణ పేరిట సొమ్ము వసూలు చేస్తున్నారని తేల్చింది. ఈ అంశంపై ఓ మహిళ ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తులపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలన్న ప్రధాన మంత్రి కార్యాలయం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ దర్యాప్తు చేపట్టింది. సీఐడీ అధికారులు గురువారం నమో ఫౌండేషన్‌పై కేసులు నమోదు చేసి, సదరు నిందితులను వేటాడే పనిలో పడ్డారు. మహిళ ఫిర్యాదుతో.. సికింద్రాబాద్‌కు చెందిన సరోజజైన్ ప్రధాని మోదీకి వీరాభిమాని. హైదరాబాద్‌లోని చైతన్యపురిలో ఉన్న నమో ఫౌండేషన్ నిర్వాహకులు గతేడాది ఆమె వద్దకు వచ్చారు. మోదీ పేరుతో అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నామని.. దానికి విరాళాలు ఇవ్వాలని కోరారు. దీంతో సరోజజైన్ రూ.12.5 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత తాము నమో ఫౌండేషన్‌కు వస్తామని, ఎలాంటి సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారో చూస్తామని సరోజజైన్ నిర్వాహకులను కోరారు. కానీ నిర్వాహకులు పదే పదే దాటవేస్తూ వచ్చారు. చివరికి సరోజజైన్ గట్టిగా ప్రశ్నించడంతో బెదిరింపులకు దిగారు. ఎక్కువగా మాట్లాడితే ప్రాణాలు తీస్తామని హెచ్చరించారు. దీంతో ఆమె తన కుమారుడు ఆశీష్‌జైన్‌తో కలసి నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. నమో ఫౌండేషన్ పేరుతో హైదరాబాద్‌లో సాగుతున్న కార్యకలాపాలపై సమాచారమిచ్చారు. దానిని పరిశీలించిన ప్రధాని కార్యాలయం అధికారులు అసలు ‘నమో’పేరుతో ఉన్న ఫౌండేషన్‌తో ప్రధాని మోదీకి, వారి సంబంధీకులకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. అసలు ప్రధాని పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. దీంతో నమో ఫౌండేషన్ వ్యవహారంపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సీఐడీని ఆదేశించింది. 200 మందికి పైగా విరాళాలు! హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన పంకత్ మెహతా 2013లో చైతన్యపురి ప్రాంతంలో నమో ఫౌండేషన్ కార్యాలయం ప్రారంభించినట్టు సీఐడీ అధికారులు తెలిపారు. ప్రధాని మోదీ పట్ల అభిమాన మున్న ధనికులు, వీఐపీలను టార్గెట్‌గా చేసుకుని.. విరాళాలు సేకరిస్తున్నట్టుగా గుర్తించినట్టు వెల్లడించారు. గోశాలల నిర్వాహణ, మొబైల్ స్కూళ్ల పేరుతో ప్రతి ఆదివారం ఉచితంగా విద్య బోధించడం వంటివి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఫౌండేషన్‌కు ఒక్క సరోజ జైన్ మాత్రమేగాకుండా దాదాపు 200 మందికి పైగా భారీగానే విరాళాలు ఇచ్చారని సీఐడీ అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, నిర్వాహకులను అరెస్టు చేస్తామని తెలిపారు. సీఐడీకి ఫిర్యాదు చేయండి ప్రధాని మోదీ పేరు చెప్పి నమో ఫౌండేషన్ పేరిట విరాళాలు, బెది రింపు వసూళ్లకు పాల్పడుతున్న వారిపై సీఐడీకి నేరుగా ఫిర్యాదు చేయాలని ఐజీ సౌమ్యా మిశ్రా గురు వారం సూచించారు. అలాంటి ఫౌండే షన్ల నిర్వాహకులు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని.. ఫిర్యాదు చేస్తే వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని చెప్పారు.