చిచ్చురేపిన కుటుంబ కలహాలు | Ciccurepina family strife | Sakshi
Sakshi News home page

చిచ్చురేపిన కుటుంబ కలహాలు

Oct 20 2014 3:38 AM | Updated on Nov 6 2018 7:56 PM

చిచ్చురేపిన కుటుంబ కలహాలు - Sakshi

చిచ్చురేపిన కుటుంబ కలహాలు

మహబూబ్‌నగర్ క్రైం : నవ మాసాలు మోసిన ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో తెలియదు కాని తన ఆరుగురు పిల్లలకు విషం తాగించింది. అనంతరం తాను తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టగా అందరూ

మహబూబ్‌నగర్ క్రైం :
 నవ మాసాలు మోసిన ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో తెలియదు కాని తన ఆరుగురు పిల్లలకు విషం తాగించింది. అనంతరం తాను తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టగా అందరూ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే... బాలానగర్ మండలం రాజాపూర్‌కు చెం దిన ఖాజాబేగం, ఖాసీం దంపతులు కూలిపని చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నారు.

వీరికి కుమార్తెలు పదేళ్ల మైమూ దా, ఎనిమిదేళ్ల అబీదా, ఏడేళ్ల సబా, ఐదేళ్ల షాహీన్, కుమారులు రెండేళ్ల మస్తాన్, 11 నెలల నవాజ్ ఉన్నారు. కొన్ని రోజు లుగా కుటుంబంలో భార్యాభర్తలతోపాటు అత్తమామలకు మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం తల్లి తన ఆరుగురు పిల్లలను తీసుకుని భూత్పూర్ మండలం అన్నాసాగర్‌లోని దర్గాను దర్శించుకునేందుకు వెళ్లింది. వెంట తెచ్చుకున్న ఎలుకల మందును పిల్లలకు తాగించి తానూ తాగింది.

పక్కనే పోలీస్‌స్టేషన్ ఉండటంతో కానిస్టేబుల్ గమనించి వెంటనే 108కి సమాచారమిచ్చారు. హుటాహుటిన వాహనంలో వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రథమ చికిత్స నిర్వహించారు. జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించగానే తల్లి సృహలోకి వచ్చింది. మిగతా పిల్లలకు వైద్య చికిత్సలు అందించారు. వీరిలో మస్తాన్ నవాజ్ పరిస్థితి అందోళనకరంగా ఉందని ైవె ద్యులు తెలిపారు. ఖాజాబేగానికి కల్లు తాగే అలవాటు ఉందని, మద్యం మత్తులో ఈ సంఘటనకు పాల్పడి ఉంటుందని భర్త చెప్పారు. అనంతరం జడ్చర్ల రూరల్ సీఐ గిరిబాబు ఆస్పత్రికి వచ్చి  బాధితుల నుంచి వివరాలు సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement