అఫ్జల్‌గురు డెత్ వారెంట్ కాపీ ఇవ్వండి | CIC asks Tihar to make Afzal Guru's death warrant public | Sakshi
Sakshi News home page

అఫ్జల్‌గురు డెత్ వారెంట్ కాపీ ఇవ్వండి

Oct 3 2014 12:50 AM | Updated on Mar 28 2019 6:19 PM

పార్లమెంట్‌పై దాడి కేసులో ఉరిశిక్ష పడ్డ అఫ్జల్ గురు డెత్ వారెంట్ అధికార ధ్రువీకృత ప్రతిని సమాచార హక్కు చట్టం కింద అందచేయాలని తీహార్ జైలు అధికారులను కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది.

తీహార్ జైలు అధికారులకు కేంద్ర సమాచార కమిషన్ ఆదేశం

 

సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్‌పై దాడి కేసులో ఉరిశిక్ష పడ్డ అఫ్జల్ గురు డెత్ వారెంట్ అధికార ధ్రువీకృత ప్రతిని సమాచార హక్కు చట్టం కింద అందచేయాలని తీహార్ జైలు అధికారులను కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది. అఫ్జల్ గురు ఉరిశిక్ష అమలు తేదీకి సంబంధించి అతని కుటుంబ సభ్యులకు పంపిన సమాచారం వివరాలనూ వెల్లడించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఈ మధ్య ఉత్తర్వులు జారీ చేశారు. అఫ్జల్‌గురు ఉరిశిక్ష వివరాలను, అతని డెత్ వారెంట్‌ను సమాచార హక్కు చట్టం కింద ఇచ్చేందుకు తీహార్ జైలు అధికారులు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ పరాస్‌నాథ్ సింగ్ కమిషన్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కమిషనర్ శ్రీధర్.. సరైన కారణం చూపకుండా సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8(1) కింద మినహాయింపు కోరుతూ దరఖాస్తును తిరస్కరించే అధికారం తీహార్ జైలు అధికారులకు లేదని తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement