పోలియో వల్ల రెండు కాళ్లు కోల్పోయిన ఎం.రమాదేవికి సీఎం కె.చంద్రశేఖర్‌రావు అండగా నిలిచారు.
హైదరాబాద్: పోలియో వల్ల రెండు కాళ్లు కోల్పోయిన ఎం.రమాదేవికి సీఎం కె.చంద్రశేఖర్‌రావు అండగా నిలిచారు. ఆమెకు వెంటనే ఉద్యోగం కల్పించాలని మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు. నల్లగొండ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన రమాదేవి మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు.
చిన్నప్పుడే రెండు కాళ్లు కోల్పోయానని, భర్త కళ్యాణ్‌కుమార్ కూడా ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకున్నాడని ఆమె వివరించారు. ఇద్దరు పిల్లలను పోషించడం కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు చలించిన సీఎం... వెంటనే ఉద్యోగం కల్పించాలని ఆదేశించారు.