
ఆ శాఖలో అవినీతి నిజమే - కేసీఆర్
పేదలకు డబుల్ బెడ్రూం పథకాన్ని అమలు చేసి తీరుతామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్: పేదలకు డబుల్ బెడ్రూం పథకాన్ని అమలు చేసి తీరుతామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆయన బుధవారం గృహనిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ...గత ప్రభుత్వాలు పేదలను ఓటు బ్యాంక్ గానే చూశాయన్నారు.
పేదలకు ఇళ్లు దక్కకపోగా అవినీతి పెరిగిపోయిందని తెలిపారు. గృహనిర్మాణ శాఖలో అవినీతి జరిగిందని సీబీసీఐడీ విచారణలో తేలినట్టు ఆయన వెల్లడించారు. శుక్రవారం కేబినెట్ భేటీలో గృహనిర్మాణ పథకం పై చర్చించి, లబ్ధిదారుల ఎంపిక, యూనిట్ కాస్ట్ పెరుగుదలపై నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ తెలిపారు.