సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఇచ్చే ఆర్థిక సాయానికి ఎంపికైన లబ్ధిదారులకు ఫిబ్రవరిలో చెక్కులు పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా గతేడాది 71 మందికి, తర్వాత 30 మందికి ఈ సంక్షేమ నిధి ద్వారా ఆర్థిక సాయం చేసినట్లు చెప్పారు.
బుధవారం తెలుగు వర్సి టీలో తెలంగాణ మీడియా అకాడమీ పాలక మండలి సమావేశంతో పాటు జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీ సమావేశం నిర్వహించారు. సంక్షేమ నిధి ఆర్థిక సాయం కోసం వచ్చిన దరఖాస్తులను ఈ సందర్భంగా కమిటీ ఆమోదించింది. ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్ జర్నలిస్టులకు ప్రత్యేక శిక్ష ణా తరగతులు, మోనోగ్రాఫ్స్ తదితర అంశాలపై పాలకమండలి సభ్యులు ఆమోదం తెలిపారు.
జర్నలిస్టు సంక్షేమ నిధి లబ్ధిదారులకు ఫిబ్రవరిలో చెక్కులు
Jan 25 2018 2:12 AM | Updated on Jan 25 2018 2:12 AM
Advertisement
Advertisement