
అమరవీరుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ
తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగం చిరస్మరణీయమని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగం చిరస్మరణీయమని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన అమరవీరుల కుటుంబాల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లాకు చెందిన అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. మొత్తం 26 కుటుంబాలకు మంత్రి చెక్కులు పంపిణీ చేశారు.