పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకం: చాడ

Chada Venkat Reddy Slams Citizenship Bill - Sakshi

సాక్షి, సిద్దిపేట: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ (సవరణ) బిల్లును వ్యతిరేకిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌ సీపీఐ కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉల్లిగడ్డ ధరలతో సహా నిత్యావసరాల వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతు బంధు పథకం కింద రైతులకు ఖరీఫ్‌ సహాయాన్ని త్వరగా అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం తరపున ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం దుకాణాలకు పర్మిట్లు ఇవ్వడంతో మద్యానికి బానిసలైన యువకులు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు .

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top