
రైలు కింద పడి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలోని చింతల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలో గురువారం బీటెక్ విద్యార్థిని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జీఆర్‌పీ ఎస్సై పి. శ్రీనివాస్ కథనం ప్రకారం..
కరీమాబాద్: వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలోని చింతల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలో గురువారం బీటెక్ విద్యార్థిని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జీఆర్‌పీ ఎస్సై పి. శ్రీనివాస్ కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మట్టపల్లి మండలం రాంచంద్రాపూర్ గ్రామానికి చెందిన రూపావత్ లలిత(19) కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రథమ సంవత్సరం బీటెక్ (ఈసీఈ) చదువుతోంది. యూనివర్సిటీ సమీపంలోని జాగృతి హాస్టల్‌లో ఉంటోంది. గురువారం ఉదయం హాస్టల్‌లో టిఫిన్ చేసి బయటకు వచ్చిన లలిత చింతల్ ఫ్లైవర్ బ్రిడ్జి వద్ద సుమారు 10.30 గంటలకు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది.
లలిత ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియరాలేదు. మృతదేహం వద్ద దొరికిన సిమ్ ఆధారంగా పోలీసులు లలిత అన్నయ్య రమేష్‌కు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు ఎస్సై తెలిపారు. లలిత ఆత్మహత్య చేసుకునే ముందు చాలాసేపు ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది.