
హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌ను పేల్చివేస్తామంటూ శుక్రవారం సాయంత్రం ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన కార్యాలయ సిబ్బంది వెంటనే ఈ సమాచారాన్ని బంజారాహిల్స్ పోలీసులకు అందించడంతో భవన్‌కు దారి తీసే రహదారులతో పాటు చుట్టూ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీం పోలీసులు భవన్‌లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి సెల్ నంబర్ ఆధారంగా అడ్రస్‌ను కనుగొన్న పోలీసులు అతడిని ఆదిలాబాద్ వాసిగా గుర్తించారు. ఎస్సార్‌నగర్, యూసూఫ్‌గూడ ప్రాంతాల నుండి ఫోన్ వచ్చినట్లు సెల్‌టవర్ ఆధారంగా తెలుసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.