బోధన్ ఆస్పత్రి డాక్టర్‌పై సస్పెన్షన్ వేటు | Bodhan Hospital doctor suspended | Sakshi
Sakshi News home page

బోధన్ ఆస్పత్రి డాక్టర్‌పై సస్పెన్షన్ వేటు

Dec 31 2015 1:37 PM | Updated on Oct 17 2018 6:06 PM

నిజామాబాద్ జిల్లా బోధన్ ఆస్పత్రి గైనకాలజిస్టు డాక్టర్ దుర్గా ప్రమీలపై సస్పెన్షన్ వేటు పడింది.

నిజామాబాద్ జిల్లా బోధన్ ఆస్పత్రి గైనకాలజిస్టు డాక్టర్ దుర్గా ప్రమీలపై సస్పెన్షన్ వేటు పడింది. గురువారం మధ్యాహ్నం ఆస్పత్రిని కలెక్టర్ యోగితారాణా తనిఖీ చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విషయం ఈ సందర్భంగా ఆమె దృష్టికి వచ్చింది. దీనిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు గైనకాలజిస్టు దుర్గా ప్రమీలనే కారణమంటూ సస్పెన్షన్ ఉత్తర్వులిచ్చారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని కలెక్టర్ హెచ్చరించారు.



 

Advertisement
 
Advertisement
Advertisement