అంబేడ్కర్‌ విగ్రహానికి నల్ల ముసుగు | Black mask to ambedkar statue | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ విగ్రహానికి నల్ల ముసుగు

Jun 11 2018 1:48 AM | Updated on Aug 17 2018 8:11 PM

Black mask to ambedkar statue - Sakshi

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని వినాయక చౌరస్తా వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నల్ల ముసుగు వేశారు. దీంతో దళిత సంఘాలు ఆదివారం ఉదయం వినాయక చౌరస్తా వద్ద ధర్నా చేపట్టాయి.

నిందితులను  పట్టుకుని చర్యలు తీసుకుంటామని ఏసీపీ జితేందర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ వేణుగోపాల్‌రెడ్డి హామీ ఇవ్వడంతో ధర్నా విరమించాయి. తర్వాత దళిత సంఘాలు అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశాయి. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement