కంటి ఆరోగ్యం కోసం..! | Beauty Tips: Sleep Mask for Eyes Benefits: Improved Sleep and Health | Sakshi
Sakshi News home page

కంటి ఆరోగ్యం కోసం..! నల్లటి వలయాలు సైతం..

Nov 2 2025 10:18 AM | Updated on Nov 2 2025 10:18 AM

Beauty Tips: Sleep Mask for Eyes Benefits: Improved Sleep and Health

ఈ డిజిటల్‌ ప్రపంచంలో చాలామందికి కళ్ల అలసట, కళ్లు పొడిబారడంతో పాటు నిద్రలేమి కూడా ఎక్కువ అవుతుంది. కంప్యూటర్‌ స్క్రీన్‌లు, మొబైల్‌ ఫోన్‌లో ఎక్కువగా చూడటంతో కళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. చిత్రంలోని ఈ  హీటెడ్‌ ఐ మాస్క్‌–పై సమస్యలన్నింటికీ అద్భుతమైన, సౌకర్యవంతమైన పరిష్కారాన్ని అందిస్తుంది. ఇది కేవలం నిద్ర మాస్క్‌ మాత్రమే కాదు, కంటి ఆరోగ్యం కోసం రూపొందిన చికిత్సా సాధనం. 

ఈ మాస్క్‌ ఉపయోగిస్తే దీనిలోని ‘ఫార్‌ ఇన్‌ఫ్రారెడ్‌ టెక్నాలజీ’ చాలా ఉపశమనం కలిగిస్తుంది. ఇది కళ్ళకు వేడిని సమర్థంగా అందిస్తుంది. కళ్లు పొడిబారడాన్ని తగ్గిస్తుంది. ఎక్కువ స్క్రీన్‌ చూడటంతో ఏర్పడే ఒత్తిడిని ఇట్టే తగ్గిస్తుంది. సైనస్, తలనొప్పి వంటి సమస్యలకు కూడా ఈ ఐ మాస్క్‌ బెస్ట్‌ ఆఫ్షన్‌ అని చెప్పుకోవచ్చు. 

అంతే కాదు ఈ మాస్క్‌ ధరిస్తే కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గుతాయి. ఈ డివైస్‌ కంటి వాపును తగ్గించి, గ్రంథుల పనితీరును మెరుగుపరుస్తుంది. సాధారణ మైక్రోవేవ్‌ లేదా స్టీమ్‌ మాస్క్‌ల మాదిరిగా కాకుండా, నిరంతరం వేడిని అందిస్తుంది.

ఇందులో 95 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ నుంచి 3–స్థాయిల హీట్‌ సెట్టింగ్‌లు ఉన్నందున మన సౌలభ్యం మేరకు ఉష్ణోగ్రతను ఎంచుకోవచ్చు, మార్చుకోవచ్చు. అలాగే దీనిలో 15 నిమిషాలు, 30 నిమిషాలు, 45 నిమిషాలు, 60 నిమిషాలతో టైమర్‌ కూడా ఉంది. ఇది సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. 

ఈ మాస్క్‌ యుఎస్‌బీ–పవర్డ్‌ కావడంతో దీనిని ఎక్కడైనా సులభంగా ఉపయోగించుకోవచ్చు. వాల్‌ చార్జర్‌లు, ల్యాప్‌టాప్‌లు, పోర్టబుల్‌ పవర్‌ బ్యాంక్‌లు, కార్‌ చార్జర్‌లు ఇలాంటి వాటికి కనెక్ట్‌ చేసి ఆఫీసులో, ఇంట్లో లేదా ప్రయాణంలో కూడా ఈ మాస్క్‌ను వినియోగించుకోవచ్చు.

కళ్లకింద నల్లటి వలయాలను పోగొట్టే స్క్రబ్‌
మృతకణాలను పోగొట్టి, చర్మాన్ని మృదువుగా మార్చే స్క్రబ్‌ను ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా నిమ్మకాయ తొక్క పైపొరను ఒలిచి ఎండపెట్టుకోవాలి. బాగా ఎండిన తర్వాత మిక్సీ పట్టి పౌడర్‌లా చేసి దాచుకోవాలి. అలా తయారు చేసుకున్న నిమ్మతొక్క పొడిని టేబుల్‌ స్పూన్‌ తీసుకుని దానిలో టేబుల్‌ స్పూన్‌ పంచదార,  టేబుల్‌ స్పూన్‌ తేనె వేసి బాగా కలుపుకుని, ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 

అనంతరం బాగా స్క్రబ్‌ చేసుకుని ఓ ఐదు నిమిషాలు వదిలెయ్యాలి. ఆపై చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా క్రమం తప్పకుండా చేయడంతో మృతకణాలు తొలగిపోతాయి. కంటి కింద నల్లటి వలయాలు తగ్గుతాయి. చర్మం మృదువుగా మారుతుంది.

(చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం..! హైలెట్‌గా వెనక్కి ప్రవహించే నది..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement