హిందూ ముస్లింలను విడగొట్టొద్దు | bjp party contreversy on Telangana Liberation Day : mp kavitha | Sakshi
Sakshi News home page

హిందూ ముస్లింలను విడగొట్టొద్దు

Sep 4 2016 2:11 AM | Updated on Mar 29 2019 9:31 PM

హిందూ ముస్లింలను విడగొట్టొద్దు - Sakshi

హిందూ ముస్లింలను విడగొట్టొద్దు

హిందూ ముస్లింలను విడగొట్టి రాజకీయం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు.

నిజామాబాద్ ఎంపీ కవిత
సారంగాపూర్: హిందూ ముస్లింలను విడగొట్టి రాజకీయం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. ‘సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా జరపాలని బీజేపీ చెబితే మేం ఎలా జరుపుతాం... దీనిని విలీన దినంగానే పరిగణిస్తాం’ అని స్పష్టం చేశారు. శనివారం కరీంనగర్ జిల్లా సారంగాపూర్‌లో దళితులకు భూ పంపిణీ సందర్భంగా ఆమె మాట్లాడారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచనదినంగా ప్రకటించి, అధికారికంగా వేడుకలు నిర్వహించాలని బీజేపీ నాయకులు అనడం, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సైతం వారి సమావేశాల్లో పాల్గొని డిమాండ్ చేయడం సరికాదన్నారు. హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయం చేయడం బీజేపీకి అలవాటేనన్నారు. 

 డీకే అరుణ తీరు బొమ్మాళీ చందం..
మాజీ మంత్రి డీకే అరుణ ‘వదల బొమ్మాళీ వదలా..’ అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని కవిత ఎద్దేవా చేశారు. గద్వాల జిల్లా కోసం అరుణ నిరాహార దీక్షలు చేయ్యక్కర్లేదని, ఆమె గద్వాల కోటలో విశ్రాంతి తీసుకోవాల న్నారు. ఏంచేయూలో కేసీఆర్‌కు తెలుసన్నా రు. గద్వాల జిల్లాకు భౌగోళిక పరిస్థితి అనుకూలంగా లేదని అధికారులు తేల్చారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement