సత్తుపల్లి మండలంలో బీజేపీ నాయకుల ప్రచారం | BJP Election Campaign In Sattupalli | Sakshi
Sakshi News home page

సత్తుపల్లి మండలంలో బీజేపీ నాయకుల ప్రచారం

Nov 24 2018 1:18 PM | Updated on Nov 24 2018 1:20 PM

BJP Election Campaign In Sattupalli - Sakshi

ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులు  

సాక్షి,సత్తుపల్లిటౌన్‌: బీజేపీ అభ్యర్థి నంబూరి రామలింగేశ్వరరావును గెలిపించాలని కోరుతూ శుక్రవారం పట్టణంలోని వెంగళరావునగర్‌లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు భూక్యా శ్యాంసుందర్‌నాయక్, కె.రాజా, శివ, రహీం, ఆనంద్, పుల్లారావు, సుధాకర్, గణేష్, గోపి పాల్గొన్నారు. 
సత్తుపల్లి మండలంలో..  
సత్తుపల్లిరూరల్‌: మండల పరిధిలోని కిష్టాపురం, తుంబూరు గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి నంబూరి రామలింగేశ్వరరావును గెలిపించాలని కోరుతూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూసంపూడి రవీంద్ర ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా సొంత ఇంటి స్థలంలో ఒక్క ఇళ్లు నిర్మించిన దాఖలాలు లేవన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నాయుడు రాఘవరావు, పాలకొల్లు శ్రీను పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement