బయోమెట్రిక్‌ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయాలి | Biometric registration must be completed | Sakshi
Sakshi News home page

బయోమెట్రిక్‌ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయాలి

Jul 29 2016 11:17 PM | Updated on Sep 4 2017 6:57 AM

బయోమెట్రిక్‌ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయాలి

బయోమెట్రిక్‌ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయాలి

జిల్లాలో ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్‌ విద్యార్థుల బయోమెట్రిక్‌ రిజిస్ట్రేషన్‌ను సకాలంలో పూర్తి చేయాలని ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్‌ ఆదేశించారు.

  • టై, బెల్ట్, ఎల్‌పీజీ గ్యాస్‌లకు నివేదిక ఇవ్వాలి 
  • ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్‌ 
  • ఏటూరునాగారం : జిల్లాలో ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్‌ విద్యార్థుల బయోమెట్రిక్‌ రిజిస్ట్రేషన్‌ను సకాలంలో పూర్తి చేయాలని ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్‌ ఆదేశించారు.  శుక్రవారం మండల కేంద్రంలో డీడీ, డీటీడబ్ల్యూఓ, ఏటీడబ్ల్యూఓలతో టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ బయోమెట్రిక్‌ రిజిస్ట్రేషన్‌ ఎక్కడ వరకు వచ్చిందని అడిగి తెలుసుకున్నారు.  ఏటీడబ్ల్యూఓ జనార్ధన్‌ సకాలంలో పూర్తి చేసే దిశలో ఉన్నారన్నారు.  గతంలో ప్రభుత్వం ఇచ్చిన హరితహారం టార్గెట్‌ పూర్తి చేయాలని, ఇటీవల టార్గెట్‌ను మరింత పెంచిందన్నారు. దానికి తగ్గట్టుగా మొక్కలు నాటించాలన్నారు. మొక్కలు నాటించడంలో నిర్లక్ష్యం వహిస్తే పాఠశాలల ఇన్‌చార్జిలు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ట్రైబల్‌ ఇన్‌స్ట్యూషన్స్‌లో రెండు ప్రత్యేక వైద్య బృందాలతో విద్యార్థులందరికీ పరీక్షలు చేయించే విధంగా చర్యలు చేపట్టామన్నారు.  విద్యార్థులందరికీ టై, బెల్ట్, బ్యాడ్జీలు ఎన్ని అవసరం ఉంటాయో నివేదికలను వెంటనే అందజేయాలన్నారు. విద్యార్థుల యూని ఫాంల కొలతలను కూడా ఇవ్వాలన్నారు. అంతేకాకుండా ఎల్‌పీజీ గ్యాస్‌ సిలెండర్లు ఎన్ని కావాల్సి ఉంటుందోనని తెలపాలన్నా రు. ప్రతి రోజు టెలీకాన్ఫరెన్స్‌ ఉంటుందని వెల్లడించారు. ఆయన వెంట డీడీ పోచం, ఏటీడబ్ల్యూఓ జనార్ధన్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement