
పాములు పట్టే వ్యక్తి అందుబాటులో లేడని పాఠశాలను మూసివేశారు.
సాక్షి, భూపాపలల్లి రూరల్: భూపాలపల్లి మునిసిపాలిటీ పరిధిలోని పుల్లూరి రామయ్యపల్లి శివారులోని గండ్రపల్లి ప్రాథమిక పాఠశాలలో పొడవైన నాగుపాము దూరింది. సోమవారం పాఠశాల తెరిచేసరికి బీరువా కింద పాము ఉందనే విషయాన్ని విద్యావలంటీర్ గమనించింది. గ్రామస్తులకు సమాచారమివ్వడంతో పాములు పట్టే వ్యక్తి అందుబాటులో లేడని పాఠశాలను మూసివేశారు. మంగళవారం గ్రామానికి చెందిన పాములు పట్టే ఉప్పలయ్యకు సమాచారమివ్వడంతో ఆయన పామును పట్టి సురక్షిత ప్రదేశంలో వదిలాడు.