రామయ్య చెంతకు ‘కో(గో)టి’ తలంబ్రాలు | bhadrachalam temple is ready for sriramanavami | Sakshi
Sakshi News home page

రామయ్య చెంతకు ‘కో(గో)టి’ తలంబ్రాలు

Mar 25 2015 1:16 AM | Updated on Sep 2 2017 11:19 PM

రామయ్య చెంతకు ‘కో(గో)టి’ తలంబ్రాలు

రామయ్య చెంతకు ‘కో(గో)టి’ తలంబ్రాలు

ఖమ్మం జిల్లా భద్రాచలం రాముడి పెళ్లికి గోటితో వలిచిన కోటి తలంబ్రాలు సిద్ధమయ్యాయి.

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం రాముడి పెళ్లికి గోటితో వలిచిన కోటి తలంబ్రాలు సిద్ధమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలానికి చెందిన భక్తులు గోటితో వలిచిన ఈ తలంబ్రాలను మంగళవారం ఆల యంలో సమర్పించారు. ఉభయగోదావరి, వైజాగ్ జిల్లాల నుంచి భక్తులు  మేళతాళాలతో ఊరేగింపుగా రామాలయానికి వచ్చారు. తలంబ్రాలను అంతరాలయంలోని మూలమూర్తుల పాదాల చెంత ఉంచి పూజలు చేశారు.  
 ‘బ్రహ్మోత్సవా’లకు అంకురారోపణం
 వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం అంకురారోపణం చేశారు. మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు పవిత్ర గోదావరి నుంచి పుణ్యజలాన్ని తీసుకొచ్చారు. అనంతరం మూలమూర్తుల వద్ద బ్రహ్మోత్సవాలకు అర్చకులు అనుజ్ఞ తీసుకున్నారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement