
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ కాన్వాయ్‌లో కొత్త కారు చేరింది. ఆయనకోసం ప్రభుత్వం బెంజ్ కారును కొనుగోలు చేసింది. రూ.1.69 కోట్లతో కొన్న ఎస్–450 మోడల్ బెంజ్ కారును జీఏడీ కార్యదర్శి అర్విందర్‌సింగ్ స్వయంగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు అప్పగించారు. కాగా, బెంజ్ కారు కోసం రాజ్‌భవన్ నుంచి వచ్చిన ప్రతిపాదనను ఆర్థిక శాఖ ఆమోదించి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచే ఈ మొత్తాన్ని వెచ్చిస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.