బీసీల్లో చైతన్యం కల్పిస్తాం..

బీసీల్లో చైతన్యం కల్పిస్తాం..


రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ రాములు

హన్మకొండ అర్బన్: అలెగ్జాండర్, ఫిడెల్ క్యాస్ట్రో తరహాలో బీసీల్లో చైతన్యాన్ని నింపేలా బాటలు వేస్తామని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు తెలిపారు. వారికి వ్యక్తిత్వ వికాసం కల్పించి జ్ఞానమార్గం చూపిస్తామని అన్నారు. కమిషన్ సభ్యులు కృష్ణమోహన్, రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలసి వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి నిర్ధేశించిన ప్రకారం రాష్ట్రంలో బీసీల ఆర్థిక స్థితిగతులు, కుల వృత్తులపై 3 నెలల పాటు అధ్యయనం చేసి వెరుు్య పేజీలకు తగ్గకుండా నివేదిక ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో రెండు కోట్లకు పైగా జనాభా ఉన్న బీసీలను నిరాశ, నిస్పృహల నుంచి విముక్తులను చేయడమే కమిషన్ లక్ష్యమన్నారు. ప్రతీ గ్రామం, కుటుంబం, వ్యక్తికి సంబంధించి సమగ్ర అధ్యయనం చేసి వారికి ప్రభుత్వం ద్వారా అందుతున్న పథకాలు, కొత్తగా అమలు చేయాల్సిన పథకాలపై నివేదిక ఇస్తామన్నారు.


ఆధునిక పరిజ్ఞానం అందు బాటులోకి రావడంతో కుల వృత్తులకు కాలం చెల్లిందన్నారు. లాభసాటిగా ఉండే ఏ వృత్తిని అరుునా ఇతర కులాలు స్వీకరిస్తాయని.. దీనికోసం వారికి తగిన శిక్షణ ఇస్తూ ప్రోత్సహిస్తామని రాములు తెలిపారు. బీసీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చాలా పథకాలు అమలు చేస్తోందని, ఉపకారవేతనాలు, విదేశీ చదువులకు రుణాలు, బ్యాంకుల ద్వారా రుణాలు, ఆసరా పెన్షన్లు వంటివి ఇందులో ఉన్నాయని బీఎస్.రాములు అన్నారు. అరుుతే, ఆయా పథకాలు అర్హులకు ఏ మేరకు చేరుతున్నాయన్న విషయంలో అధ్యయనం చేస్తామని తెలిపారు. తమకు వందల సంఖ్యలో వినతులు అందాయని, వాటిని పరిశీలించి అవసరం ఉన్నవాటిని నివేదికలో పొందుపరుస్తామని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top