
ఎమ్మెల్యే మొజంఖాన్ (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : బహదూర్‌పుర ఎమ్మెల్యే మొజంఖాన్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో అతని కుటుంబ సభ్యులు హుటాహుటిన నానల్‌నగర్ ఆలివ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐసీయూలో ఉంచి మొజంఖాన్‌కు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బహదూర్‌పుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎంఐఎం శాసన సభ్యుడిగా మొజంఖాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.