ఎమ్మెల్యే అంటే ఏమనుకున్నావ్‌! | babu mohan angry on PR AE | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే అంటే ఏమనుకున్నావ్‌!

Jul 15 2017 6:23 AM | Updated on Sep 5 2017 4:02 PM

ఎమ్మెల్యే అంటే ఏమనుకున్నావ్‌!

ఎమ్మెల్యే అంటే ఏమనుకున్నావ్‌!

‘‘అంతా నీ ఇష్టారాజ్య మా? ఎమ్మెల్యే అంటే ఏమనుకున్నావ్‌.. అభి వృద్ధి కోసం నిధులు మం జూరు చేస్తే నీ ఇష్టమొచ్చిన చోట పనులు చేయిస్తావా.

పీఆర్‌ ఏఈపై ఎమ్మెల్యే బాబూమోహన్‌ ఆగ్రహం
రేగోడ్‌ (మెదక్‌): ‘‘అంతా నీ ఇష్టారాజ్య మా? ఎమ్మెల్యే అంటే ఏమనుకున్నావ్‌.. అభి వృద్ధి కోసం నిధులు మం జూరు చేస్తే నీ ఇష్టమొచ్చిన చోట పనులు చేయిస్తావా.. ఉద్యోగం ఊడదీస్తా’’అంటూ మెదక్‌ జిల్లా అందోల్‌ ఎమ్మెల్యే పి.బాబూమోహన్‌ పంచాయతీరాజ్‌ ఏఈ చంద్రశేఖర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేగోడ్‌ మండలం జగిర్యాల, కొండాపురం, రేగోడ్‌ల్లో శుక్రవారం నిర్వహించిన హరిత హారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో మొక్కలు నాటడానికి వచ్చిన బాబూమోహన్‌కు, అం తకు ముందు మంజూరు చేసిన సీసీ రోడ్డు కనిపించలేదు. సీసీ రోడ్డు నిర్మించలేదా? ఎందుకంటూ పలువురిని ఆరా తీశారు. దానిని మరోచోట నిర్మించారని తెలిసింది. తాను ఇక్కడి సీసీ రోడ్డుకు నిధులు మంజూరు చేస్తే మరోచోట వేయడం ఏమిటని ఏఈపై మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement