నల్లగొండ జిల్లా భువనగిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.
నల్లగొండ జిల్లా భువనగిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. భువనగిరి లోని టీచర్ కాలనీ చౌరస్తాలో ఆటో, బైక్ ఢీకొన్న ఘటన శనివారం సాయంత్రం జరిగింది. బీబీనగర్ మండలం మగ్దుంపల్లికి చెందిన బాలయ్య (43) బైక్‌పై తన స్వగ్రామానికి వెళుతుండ.. వేగంగా వచ్చిన ఆటో అతడిని ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన బాలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.