తెలంగాణ తల్లి విగ్రహం తొలగించేందుకు యత్నం | Attempt to Remove the Mother Statue of Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ తల్లి విగ్రహం తొలగించేందుకు యత్నం

Jun 29 2019 2:50 PM | Updated on Jun 29 2019 2:50 PM

Attempt to Remove the Mother Statue of Telangana - Sakshi

ఫిర్యాదు చేస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులు

పాల్వంచ: పట్టణంలో అంబేడ్కర్‌ సెంటర్‌లోని తె లంగాణ తల్లి విగ్రహాన్ని తొలగిస్తుండటంతో టీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుకున్నారు. అంబేడ్కర్‌ సెం టర్‌లో నూతనంగా కమర్షియల్‌ కాంప్లెక్స్‌ ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. శుక్రవారం దీనిని అక్కడ పనిచేసే వ్యక్తులు కొందరు తొలగించేం దుకు డ్రిల్‌ మిషన్‌ను తెచ్చి పనులు ప్రారంభించా రు. సమాచారం అందుకున్న టీఆర్‌ఎస్‌ నాయకు లు పొనిశెట్టి వెంకటేశ్వర్లు, సయ్యద్‌ రషీద్‌ తదితరులు అక్కడి చేరుకుని అడ్డుకున్నారు. పదేళ్ల కిందట తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, విగ్రహా న్ని తొలగించడం సరైంది కాదన్నారు. తొలగించే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్‌ స్టేషన్‌లో పట్టణ ఎస్‌ఐ ముత్యం రమేశ్‌కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో నాయకులు తంగేటి రాము, పెద్ది బాబు, ఉబ్బన శ్రీను, గిరి పాల్గొన్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement